తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు పార్టీ కార్యకర్తలకు తలనొప్పిగా మారాయి. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉన్నా సరే చంద్రబాబు నాయుడు పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ని ఆయన నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు అని ఆరోపణలు ముందు నుంచి కూడా వినబడుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో చంద్రబాబు నాయుడు హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నా సరే ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్లడం ద్వారా పార్టీ నష్ట పోవడమే గాని లాభం వచ్చే అవకాశాలు ఏ మాత్రం కూడా లేవు అనేది అర్థం అవుతుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించిన సరే…అధికారంలో ఉన్నది కాబట్టి కచ్చితంగా పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పరువు పోయే అవకాశాలు ఉంటాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చంద్రబాబు నాయుడు పదేపదే వెనకేసుకు రావడం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ జరపాలని డిమాండ్ చేయడంతో… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు విజయం సాధించాలని భావిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా కూడా బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అయినా సరే ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా లేకపోతే ఇలాగే మొండిగా ముందుకు వెళ్తారా అనేది చూడాలి. ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించడం పై ఇప్పటికే చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.