రాజకీయంగా చంద్రబాబు నాయుడు పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఈ చదరంగంలో వైసీపీ మంత్రి కొడాలి నాని ని పావులా వాడుతున్నారా? అంటే అవుననే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో విమర్శించిందో! అంతకు రెట్టింపు చర్యలతో జగన్ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నేతల అరెస్ట్ లే అందుకు ఉదాహరణ. అలాగని టీడీపీ నేతలు సుద్ద పూసలని కాదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు ప్రతిఫలం జగన్ రూపంలో అలా అందుతుందంతే. విశాఖ, కర్నూలు రాజధానుల ప్రకటనతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ రూపమే మారిపోయింది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్ బలం రెట్టింపు అయింది. అమరావతి నుంచి విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాల్లో వైసీపీ బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాల పేదల్ని టీడీపీపైకి మంత్రి కొడాలి నాని రూపంలో ఉసిగొల్పినట్లు ఇప్పటికే మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడేది పసుపు నేతలేనని బలంగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే నాని నోట శాసన రాజధిని తరలింపు మాట వచ్చినట్లు … ఇదంతా జగన్నాటకం అన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా జగన్ అంతకు మంచి బలమైన అస్ర్తాన్ని..రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ బలం పుంజుకునే బాణాన్ని సంధించినట్లు వెబ్ మీడియాలో ఠారెత్తిపోతుంది. అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాన గణాన్నే ఆయుధంగా మలిచినట్లు ప్రచారం సాగుతోంది. కొడాలి నాని ఓ వైపు చంద్రబాబు నాయుడు ని వ్యతిరేకిస్తునే మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తడం రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను డిఫెన్స్ లో పడేసినట్లు పొలిటికల్ కారిడార్ లో చర్చ నీయాంశంగా మారాయి. టీడీపీ పార్టీ పునాదుల్ని దుష్టిలో పెట్టుకుని చంద్రబాబును ద్వేషించి..ఎన్టీఆర్ ని ప్రేమించినట్లు మాట్లాడటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు.
ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ వైపు ఆకర్షితులు అవ్వడానికి ఆస్కారం ఉంటుందని..ఎన్టీఆర్ అభిమాన సంఘాల్లో సైతం ఈ విషయం చర్చకు దారి తీసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా చంద్రబాబు పై తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు పొలిటికల్ సినారేలో హాట్ టాపిక్ గా మారింది. కొడాలి కామెంట్లు వెనుక ఇంత మీనింగ్ ఉందని అంటున్నారు. ఇదంతా జగన్ ప్లానింగ్ అనే టాక్ వినిపిస్తోంది. జగన్ వెనుకుండి నానిని ముందుకు తోసినట్లు మాట్లాడుకుంటున్నారు.