మరికొన్ని రోజుల్లో తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి వస్తారని అందరూ భావించగా ఎవరూ ఊహించని విధంగా తారకరత్న మరణానికి సంబంధించిన వార్త వినాల్సి వచ్చింది. తారకరత్న చివరి వీడియో పాదయాత్రలో పాల్గొన్న వీడియోకు కావడం గమనార్హం. గత నెల 27వ తేదీన లోకేశ్ పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల తారకరత్నకు మెదడులో ఒకవైపు వాపు వచ్చింది.
మధ్యమధ్యలో తారకరత్నను బ్రతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయగా కోలుకుంటున్నట్టు కనిపించినా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. తారకరత్న మరణించారనే వార్త అభిమానులను శోకసంద్రానికి గురి చేసింది. తారకరత్న అప్పటికే అస్వస్థతకు గురయ్యారని ఎండకు తాళలేక ఆయన గుండెపోటుకు గురై మృతి చెందే పరిస్థితి వచ్చిందని బోగట్టా. తారకరత్న కోసం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అయిందని సమాచారం.
పాదయాత్ర రోజు జరిగిన ఘటన వల్ల లోకేశ్ కు సైతం బ్యాడ్ నేమ్ వచ్చింది. లోకేశ్ ఐరన్ లెగ్ అని కొంతమంది కామెంట్లు చేశారు. తారకరత్న చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాదయాత్రలో పాల్గొన్న ఫోటోలు చూసి తారకరత్న అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. 40 సంవత్సరాల వయస్సులోనే తారకరత్న హఠాన్మరణం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.
తారకరత్న మరణంతో భార్య, పిల్లలు అనాథలు కాగా కుటుంబ సభ్యులు అండగా నిలవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మంచు మనుషులనే దేవుడు తీసుకెళతాడని అందుకే తారకరత్నను తీసుకెళ్ళాడని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.