వైసీపీలోకి తమ్మారెడ్డి భరద్వాజ.!

కమ్యూనిస్టు భావాలున్న సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ, రేపో మాపో వైసీపీలో చేరిపోయే అవకాశాలున్నాయి. నిజానికి, ఆయనెప్పుడూ వైసీపీ సానుభూతిపరుడిగానే వ్యవహరిస్తూ వచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు మరో విషయంలో కావొచ్చు.. టీడీపీ హయాంలో వైసీపీకి అనుకూలంగానే మాట్లాడారాయన.

తాజాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. వైసీపీ భాషలో జనసేన నేత నాగబాబు, తమ్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుక్కారణం. అంతకు ముందు తమ్మారెడ్డి భరద్వాజ, జనసేన పార్టీ మీద అభ్యంతరకర వ్యాఖ్యల చేశారు.

వాస్తవానికి, తమ్మారెడ్డి లాంటోళ్ళవల్ల వైసీపీ అదనంగా ఓట్లు పడేదేమీ వుండదు. కాకపోతే, రాజకీయ ప్రత్యర్థులపైకి ఇలాంటోళ్ళను అస్త్రాలుగా ప్రయోగించడం వైసీపీకి అలవాటే. ఓ పోసాని కృష్ణమురళి, ఓ కత్తి మహేష్, ఓ శ్రీరెడ్డి… ఈ కోవలోనే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నమాట. అయితే, తమ్మారెడ్డి భరద్వాజ తనకు రాజకీయ లక్ష్యాలేవీ లేవంటున్నారు. ప్రత్యేక హోదా కోసం తన స్వరం వినిపించేందుకు ఎప్పుడూ ముందుంటానంటారు.

కానీ, ఆయన్ని ఎలాగోలా రాజకీయ తెరపైకి తెచ్చేందుకు తెరవెనుక వైసీపీ ప్రయత్నాలు గట్టిగానే సాగుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడకపోయినా, జనసేన మీద విమర్శలు చేస్తే చాలన్న కోణంలో ఆయనతో వైసీపీ టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.