ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన సుప్రీమ్ కోర్ట్  – పచ్చ పత్రికలకు చెంపదెబ్బ!

Supreme court judgement slap to Yellow Media
“మా పత్రికలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుంది హైకోర్టు” అని ఒక క్షుద్రజ్యోతి వాడు సగర్వంగా ప్రకటించుకుంటాడు. 
 
“గౌరవ హైకోర్టు వారు మా పత్రికలో వచ్చిన వార్తలను విశ్వసిస్తారు” అని మరొక ప్రజాస్వామ్య హంతకుడు ఫ్రంట్ పేజీలో రాసుకుంటాడు! 
 
Supreme Court of India 
మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా అనేది ఒక కుళ్ళిన కొబ్బరికాయగా మారి చాలా ఏళ్ళు గడిచింది.  కులగజ్జితో కునారిల్లిపోతూ, తమ కులస్తులు వేలకోట్ల రూపాయలు దోచుకుని సంపదను సృష్టించుకున్నా, వారి దోపిడీలో వాటాలను గిల్లుకుంటూ, తమ కులనాయకుడిని ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేస్తూ మీడియా అనేది ఏనాడో మృతదేహసమానంగా ప్రజలచేత ఛీత్కరించబడింది.  
 
ఇలాంటి పరిస్థితుల్లో నిన్న అత్యున్నత న్యాయస్థానం “పత్రికల్లో వచ్చిన కథనాలు తీసుకొని మీకేం కావాలో అది కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారా? దీన్ని ఎలా పరిగణించాలి. వంద మంది పిటిషన్లో ఇంప్లీడ్‌ అవుతామంటే వంద మందినీ అనుమతించాలా? ఇలా చేస్తే ఇది అంతులేని విచారణ అవుతుంది” అని పిటీషన్ ను కొట్టిపారెయ్యడం కొందరికి చెంపదెబ్బ లాంటిది అని చెప్పుకోవాలి.  
 
ఇవాళ తమ గజ్జిపత్రికల్లో తమ ఇష్టం వచ్చిన వార్తలు వ్రాయడం, ఆ మరునాడు ఆ వార్తల క్లిప్పింగ్స్ ను జతపరచి కోర్టుల్లో పిటీషన్లు వేయించడం పచ్చమీడియాకు ఒక తంతుగా మారింది.  జగన్ మోహన్ రెడ్డి మీద కక్ష, కసి, తమ కులసామ్రాజ్యాన్ని కూలదోశాడన్న కడుపుమంట, కనుచూపుమేరలో తమ నాయకుడికి భవిష్యత్తు కనిపించకపోవడం అనే అసూయాద్వేషాలతో రగిలిపోతున్న క్షుద్రమీడియాకు నిన్నటి సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలు కచ్చితంగా ఎదురుదెబ్బే.  
 
ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక పార్టీ అధికారాన్ని కోల్పోవాలన్నా, అది ప్రజల తీర్పు ద్వారా మాత్రమే జరగాలి.   అంతేకానీ, కోర్టు తీర్పుల ద్వారా, కుట్రలద్వారా, కుతంత్రాల ద్వారా కానేకాదు.   దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చెయ్యాలి.  విజయం సాధించాలి.  ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి అయినవాడికి తొలగించాలని కోర్టుల్లో పిటీషన్లు వెయ్యడం ఏమిటి?  ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నిర్ణయించేవి కోర్టులు కావనే ప్రజాస్వామ్యసూత్రాన్ని భంగపరచాలని ప్రయత్నించడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి.  అలాంటి పిటీషన్లు వేసి కోర్ట్ సమయాన్ని వృధా చేసేవారిని కఠినంగా శిక్షించాలి.  
 
జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాసారు.  అదేమీ రహస్యం అని వారు చెప్పలేదు.  కాబట్టే నిర్భయంగా దాన్ని బయట పెట్టారు.  అదేమీ హైకోర్టు, సుప్రీమ్ కోర్టులోని కొందరు న్యాయమూర్తుల మీద మాత్రమే.  న్యాయవ్యవస్థ మీద కాదు.  ఒక అధికారి తప్పు చేశాడని మనం భావిస్తే అతనిమీద పై అధికారులకు ఫిర్యాదు చెయ్యడం లేదా?  అలాగే కొందరు న్యాయమూర్తులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి సందేహం కలిగింది.  దానిపై ఫిర్యాదు చేశారు.  దాన్ని పిటీషన్ లా స్వీకరించి విచారణ జరిపమని కోరలేదే!  ఆ హక్కు, అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉండదు?  అదేదో పెద్ద నేరం అన్నట్లు దానిమీద విచారణ ఏమిటి?  పైగా ఫిర్యాదు చేసినంతమాత్రాన పదవినుంచి తొలగించాలని పిటీషన్ ఏమిటి?  అది తప్పో, ఒప్పో సుప్రీమ్ ధర్మాసనం ఇప్పటికే విచారిస్తున్నది కదా!  
 
ప్రజల్లో దూసుకునిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను ఏమాత్రం సహించలేకపోతున్న అజ్ఞానులను ప్రజలు క్షమించరని గుర్తు పెట్టుకోవాలి.  పిటీషన్లు వేసి జగన్ ను దించాలనే వృధా ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవు.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు