బాలయ్య పరువు తీసిన శాతకర్ణి.. వైసీపీ సర్కార్ కు భలే కలిసొచ్చిందిగా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు అప్పటి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పించాయి. అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం టీడీపీనే కావడంతో సులభంగానే ఈ సినిమాకు పన్ను రాయితీ ప్రయోజనాలు దక్కాయి.

తెలంగాణ ప్రభుత్వం సైతం గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇచ్చినా ఆ మేరకు టికెట్ రేట్లను తగ్గించి ప్రజలకు బెనిఫిట్ కలిగించడంలో గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ చిత్రయూనిట్ ఫెయిలైంది. ఫలితంగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి బాలయ్యకు నోటీసులు అందాయి.

సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ ను దాఖలు చేయగా ప్రేక్షకులకు పన్ను రాయితీ ప్రయోజనాలను బదలాయించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఇందుకు సంబంధించి నోటీసులు అందాయి. బాలయ్యపై విమర్శలు చేయడానికి వైసీపీ సర్కార్ కు ఈ నోటీసులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

బాలయ్యతో పాటు ప్రతివాదులందరికీ ఈ పిటిషన్ విషయంలో నోటీసులు జారీ అవుతున్నాయి. అప్పట్లో బాలయ్య పరువు నిలబెట్టిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఇప్పుడు మాత్రం బాలయ్య పరువు పోవడానికి కారణమైంది. ఈ విషయానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.