వైసీపీ మంత్రి రోజాకు వివాదాలు కొత్త కాదు. గతంలో టీడీపీలో ఉన్న రోజా ఆ సమయంలో వైఎస్సార్ పై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి రోజా ఎమ్మెల్యేగా ఉండగా ప్రస్తుతం నియోజకవర్గంలో ఆమెకు అనుకూల పరిస్థితులు లేవు. ఆమెను అవమానించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని జిల్లా నేతలు వదులుకోవడం లేదు.
రోజాను మానసికంగా కొంతమంది నేతలు వేధిస్తున్నారని గతంలో ప్రచారం జరగగా ఆ ప్రచారమే నిజమవుతోంది. అయితే రోజా వాట్సాప్ గ్రూపులలో ఆడియో షేర్ చేయడం ద్వారా ఫలితం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య ఉంటే సీఎం జగన్ తో చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని రోజాకు కొంతమంది సూచనలు చేస్తుండటం గమనార్హం. ఈ విధంగా ఆడియోలు షేర్ చేయడం ద్వారా పోయేది పార్టీ పరువేననే సంగతి తెలిసిందే.
సమస్యలను పరిష్కరించుకోవడంపై రోజా దృష్టి పెట్టాలని చిన్న సమస్యలను సైతం పెద్దవి చేసుకునే విధంగా ఆమె అడుగులు వేయడం కరెక్ట్ కాదని మరి కొందరు సూచిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు రోజా వల్ల వైసీపీపై విమర్శలు చేస్తే మాత్రం ఆ విధంగా వైసీపీకి కలిగే నష్టం అంతాఇంతా కాదు. రోజా ఇతర నేతలతో తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.
రోజా సోషల్ మీడియా ద్వారా, వాట్సప్ ద్వారా పార్టీ పరువును తీసుకుంటే రాబోయే రోజుల్లో ఆమెకు టికెట్ కూడా దక్కకపోవచ్చు. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే, మంత్రి అయిన రోజా రాజకీయాల్లో సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేయాలే తప్ప వివాదాలు, విమర్శల ద్వారా ప్రయోజనం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.