కుక్కలు ఎవరు బాలయ్యా.. పేరు మార్చితే ఇంత దారుణంగా స్పందిస్తారా?

స్టార్ హీరో బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ రెండు రంగాలలో సక్సెస్ సాధించడం గమనార్హం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై బాలయ్య ఘాటుగా స్పందించడంలో తప్పు లేదు. అయితే విమర్శలు ఒకింత హద్దులు దాటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎవరిని కుక్కలు అంటున్నావు బాలయ్యా అంటూ కొంతమంది నెటిజన్లు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రాన బాలయ్య ఇంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉందా అని మరి కొందరు ప్రశ్నిస్తుండటం గమనార్హం. బాలయ్య హీరో కావడంతో పాటు ఎమ్మెల్యే కూడా అని హుందాగా స్పందించాల్సిన బాలయ్య ఈ విధంగా స్పందించడం ఏమిటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ నేతలు కూడా బాలయ్యను, బాలయ్య కుటుంబ సభ్యులను ఇదే తరహాలో విమర్శిస్తే ఎలా ఉంటుందని కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాలయ్య టీడీపీ నేతల మెప్పు పొందడానికి ఈ తరహాలో విమర్శలు చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాలయ్యను ఆయన అభిమానులలో ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు.

బాలయ్యనే అధికారంలో ఉన్న నేతలను కుక్కలు అంటూ విమర్శలు చేస్తే ఆయన అభిమానులు సైతం ఇదే తరహాలో కామెంట్లు చేసే ఛాన్స్ ఉంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నా బాలయ్య స్పందనతో పోల్చి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించిన తీరు బాగుందని చెప్పవచ్చు. హద్దులు దాటిన విమర్శలు బాలయ్య లాంటి నేతలకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు.