వైసీపీ వ్యతిరేక ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్న బాలకృష్ణ.. విమర్శలు తప్పవా?

అన్ స్టాపబుల్ సీజన్1 అంచనాలకు మించి సక్సెస్ కాగా బాలయ్య తన హోస్టింగ్ టాలెంట్ తో అన్ స్టాపబుల్ సీజన్2 ను కూడా సక్సెస్ చేస్తారని చాలామంది భావిస్తున్నారు. అయితే బాలయ్య ఈ షోను పొలిటికల్ షోగా మారుస్తున్నారని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన షోలో బాలయ్య వైసీపీ వ్యతిరేక ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

మూడు రాజధానుల గురించి, పరోక్షంగా వైఎస్ జగన్ గురించి ప్రస్తావిస్తూ ప్రజల్లో వైసీపీని చులకన చేయాలని బాలయ్య ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సొంత పార్టీ ప్రయోజనాల కోసం అన్ స్టాపబుల్ షోను బలి చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ తరహా పనుల వల్లే ఈ షోకు మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ వ్యతిరేక ప్రచారానికి బాలయ్య ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ షోకు హాజరైతే తమపై కూడా నెగిటివ్ ఒపీనియన్ కలుగుతుందని కొంతమంది సెలబ్రిటీలు భావించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం పరువుప్రతిష్టలకు చెడ్డపేరు తెచ్చే విధంగా బాలయ్య వ్యవహరించడం సరికాదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలయ్య ఈ విధంగా చేయడం వల్ల పోయేది టీడీపీ పరువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ గురించి ఎప్పుడూ ఒక నెగిటివ్ కామెంట్ కూడా చెయ్యని బాలకృష్ణ వైసీపీని టార్గెట్ చేసేలా పదేపదే విమర్శలు చేయడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.