ఎన్టీఆర్ పై బాలయ్యకు చాలా కోపం ఉందిగా.. సాక్ష్యం ఇదే?

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కలిసి కనిపించలేదనే సంగతి తెలిసిందే. బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ ఉందని ఇప్పటికే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్2 కు తారక్ ను పిలిచే అవకాశం ఉన్నా నో చెబుతున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్2 ఎపిసోడ్ లో బాలయ్య నాగవంశీతో మాట్లాడుతూ ఆ బ్యానర్ లో తెరకెక్కిన హిట్ సినిమాలైన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాల గురించి ప్రస్తావించారు.

అయితే అదే బ్యానర్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా తెరకెక్కినా ఆ సినిమా గురించి మాత్రం బాలయ్య నోరు మెదపలేదు. జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్యకు ఏ రేంజ్ లో కోపం ఉందో తెలియడానికి ఇదే సాక్ష్యమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తానని చెబితే మాత్రం తారక్ కు కోపం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తారక్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అభిమానుల నుంచి ఈ విషయంలో ఒత్తిడి ఉన్నా తారక్ మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెడితే తన సినీ కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతుందని తారక్ అనుకుంటున్నారని సమాచారం అందుతోంది. తారక్ ప్రస్తుతం జపాన్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినా ఆయన ఏపీ సీఎం కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు తారక్ కు సన్నిహితులు అనే సంగతి తెలిసిందే. ఆ నేతలతో తారక్ కు ఎలాంటి బాండింగ్ ఉందో క్లారిటీ రావాల్సి ఉంది. తారక్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.