శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఫైట్ మొదలెట్టినప్పుడు రాజుకుంది ఆమెకి, పవన్ కళ్యాణ్ కి వివాదం. అప్పటి నుండి దీనికి ఎండ్ కార్డు పడలేదు. పవన్ కళ్యాణ్ తన తల్లిని తిట్టినప్పుడు రియాక్ట్ అయినా తర్వాత తర్వాత ఆమె ఏం మాట్లాడిన రియాక్ట్ అవడం లేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం సమయం దొరికినప్పుడల్లా పవన్ పై వివాదాస్పద పోస్టులు పెడుతూనే ఉంటుంది.
దీనికి కారణం ఆమె వ్యాఖ్యలకి పవన్ రియాక్ట్ అవకపోయిన ఆయన ఫ్యాన్స్ ఘ్టుగానే స్పీసంధిస్తారు. దీంతో శ్రీరెడ్డి అవకాశం వస్తే చాలు పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. కొద్దిరోజులుగా పశ్చిమ గోదావరిలో పర్యటిస్తున్న పవన్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రౌడీషీటర్ అంటూ అభివర్ణించారు. ఆయనొక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం చింతమనేనిపై చర్యలు తీసుకోకుంటే మేము తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ చేసిన పలు వ్యాఖ్యలపై చింతమనేని రియాక్ట్ అయ్యారు. ‘నా మీద మీరు చేసిన ఆరోపణలను మీకు నచ్చిన వారితో త్రీ మెంబర్ కమిటీ వేసి దర్యాప్తు చేయించండి, నెల తరువాత చర్చకు సిద్ధం అని చింతమనేని సవాల్ విసిరారు. బజారు మనిషిలా మాట్లాడవద్దని పవన్ కు సలహా ఇస్తూ… ‘‘నన్నురాజీకీయంగా ఎదుర్కో. రా, దెందులూరు నుంచి పోటీ చేయ్. గెలిస్తే అభినందించి నియోజక వర్గంలో ఊరేగిస్తాను,’’ అని అన్నారు.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి…చింతమనేనిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తన వాల్ పై ఒక పోస్టు పెట్టింది. “పీకే నీ నోటి దూలకి కెళ్లెం వేస్తా ఉండు. తమలపాకు రౌడీ.. నువ్వు నలుగురు పెళ్ళాలకి మొగుడు. కానీ నీకు నేను కరెక్ట్ మొగుడు”. అంటూ వివాదాస్పద పోస్టు పెట్టింది. శ్రీరెడ్డి పెట్టిన పోస్టు కింద ఉంది చూడండి.
