జగన్ నా బాస్.. చంద్రబాబు డైనమిక్ లీడర్ : శ్రీరెడ్డి (వీడియో)

ఆంధ్రా రాజకీయాల్లో పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు ప్రతిపక్ష నేత జగన్ కు, సిఎం చంద్రబాబుకు మధ్య మాటల దాడులు, ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయి. రెండు పార్టీల మధ్య భీకరమైన రాజకీయ పోరు సాగుతూ ఉన్నది. ఇక జనాలు కూడా అంతే వైసిపి నచ్చిన వారికి టిడిపి అంటే ధ్వేషం ఉంటది. అలాగే టిడిపి నచ్చే వారికి వైసిపి అంటే ధ్వేషం ఉంటది. చంద్రబాబు మీద అభిమానం చూపేవారు జగన్ ను ధ్వేషిస్తారు. అలాగే జగన్ ను అభిమానించేవారు కచ్చితంగా బాబును వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం బాబు, జగన్ ఇద్దరినీ విమర్శించేవాళ్లూ ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇద్దరు నేతలను అభినందించేవారు ఉంటారు. అందులో సినీ యాంకర్ శ్రీరెడ్డి ఒకరు. ఆమె జగన్ ను ఉద్దేశించి నా బాస్ జగన్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. పనిలో పనిగా ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ మీద, పవన్ ఫ్యామిలీ మీద తిట్ల దండకం అందుకున్నారు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఫుల్ వీడియో కింద ఉంది చూడండి.

శ్రీరెడ్డి ఎందుకిలా చేస్తున్నారు ??

శ్రీరెడ్డి రోజుకో తీరుగా వ్యవహరిస్తూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం సంచలనం కోసమే ఆమె మాట్లాడుతున్నట్లు జనాల్లో అంచనాలున్నాయి. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అంటూ కామెంట్ చేశారు. పవన్ ను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ తన ఆసక్తిని వ్యక్తం చేశారు. పవన్ పాద దూలి తాకినా తనకు గొప్ప అదృష్టమే.. తన జన్మ ధన్యమే అన్నారు. తర్వాత పవన్ ను బూతు పదజాలంలో తిట్టారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై పగపట్టి విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల పరంపర ఎక్కడి వరకు పోయిందంటే.. లాస్ట్ కు పవన్ తల్లిని అవమానించేవరకు పోయింది. దీంతో సినీ జనాలంతా ఏకమై శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. సామాన్య జనాలు కూడా శ్రీరెడ్డిపై మండిపడ్డారు. బాధితురాలిగా ఫైట్ చేస్తూ పవన్ తల్లిని అనరాని మాటలు అనడమేందని సామాన్య జనాలు కూడా ఫైర్ అయ్యారు. దీంతో శ్రీరెడ్డి మాట మార్చారు. వపన్ తల్లిని మాటలు అన్నందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నానంటూ వేడుకున్నారు.

అయినా శ్రీరెడ్డి రోజూ ఏదో ఒక సంచనం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జగన్ బాస్ అంటూ, చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇదే కాకుండా తమిళ నటుడు శ్రీరామ్ గురించి బూతు పోస్టు పెట్టి సంచలనం రేకెత్తించారు. తమిళ డైరెక్రట్ ఎఆర్ మురగదాస్ మీద కూడా ఫేస్ బుక్ లోని తన వాల్ మీద పోస్టు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ సిఎం కేసిఆర్ గురించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. కేసిఆర్ కు అత్యంత సన్నిహితులు క్యాస్టింగ్ కౌచ్ లో నిందితులుగా ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను నగర బహిష్కరణ చేయవద్దని కేసిఆర్ ను ప్రాధేయపడ్డారు. కత్తి మహేష్, పరిపూర్ణానంద మాదిరిగా తనను నగర బహిష్కరణ చేస్తే తనను చంపేస్తారని పోస్టు పెట్టారు. ఆమె మాటలతో కేసిఆర్ ను ఇరకాటంలోకి నెట్టారన్న చర్చ ఉంది. అంతేకాకుండా గత మూడు నెలల క్రితం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మంత్రి క్యాస్టింగ్ కౌచ్ నిందితుడు అంటూ పేరు చెప్పకుండా పోస్టు పెట్టారు. త్వరలోనే ఆ మంత్రి బండారం బట్టబయలు చేస్తానని ప్రకటించారు.

ఇలా రోజుకో రకంగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం పట్ల నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంబంధం లేని విషయాలకు కూడా పవన్ కళ్యాణ్ ను లాగేందుకు ప్రయత్నం చేస్తూ పబ్లిసిటీ కోసమే ఆరాటపడుతున్నారని కూవైట్ లో ఉంటున్న ఎన్నారై  (పవన్ ఫ్యాన్) ఒకరు తెలుగు రాజ్యంతో అన్నారు. శ్రీరెడ్డి పోరాటం క్యాస్టింగ్ కౌచ్ మీదనా? లేక పవన్ మీదనా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శ్రీరెడ్డి మానసిక స్థితి సరిగాలేనట్లుందని ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.

మొత్తానికి శ్రీరెడ్డి చేస్తున్న విశ్వసనీయత లేని హడావిడి చూసి జనాలెవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయిందని సినీ రంగానికి చెందిన పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.