కడప స్టీల్ ఫ్యాక్టరీకి రు. 5000 కోట్ల నిధులివ్వండి వెంటనే…

కడప జిల్లాలో ఏర్పాటుచేయాలనుకుంటున్న ఉక్కు ఫ్యాక్టరీ కి తక్షణమే 5000 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఫ్యాక్టరీ నిర్మాణం మీద తమ నిజాయితీని చాటుకోవాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు డా. జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి  కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఇపుడున్న వ్యవసాయ, ఆర్థిక సంక్షోభంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్  ఏర్పాటుచేసి ఉపాధి కల్పించడమొక్కటే మార్గమని ఆయన అన్నారు.

‘రాయలసీమ ప్రాంతం గత కొన్ని సంవత్సరాలుగా తాగే దానికి గుక్కెడు మంచి నీళ్ళు లేక, కరువుతో,తల్లడిల్లుతుంది. రాయలసీమ లో రైతులకు వర్షాలు పడక రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉపాధి లేక వలస వెళ్లి పోతున్నారు. ఇక్కడి ప్రజల ఆశా,ఆకాంక్ష కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయడమే. దీనికి ప్రకటన జారీ చేయడం సమాధానం కాదు. ఈ  హామీని నెరవేర్చేందుకు తాము చిత్తశుద్దితో ఉన్నామని నిరూపించుకోవాలని దీనికోసం కు కేంద్రం  తక్షణమే 5000 వేల కోట్ల రూపాయల నిధుల ను మంజూరు చేయాలి,’ అని  ఆయన అన్నారు.

 ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. 

‘ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి ఉక్కు వ్యాధి తగులుకున్నది. కొన్ని వేల మంది ఆకలి కేకలకు సబంధించిన విషయం ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ విషయం లో కేంద్ర ప్రభుత్వం కానీ,రాష్ట్ర ప్రభుత్వం కానీ వెనకడుగు వేయకూడదు. క్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం దో లేక రాష్ట్ర ప్రభుత్వం దో కాదు. అది మా రాయలసీమ బిడ్డల హక్కు,మా హక్కు ను మా మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం,’ అని హెచ్చరించారు. 
రాయలసీమ స్టీల్ కోసం ఏ  అథారిటీ అని పెట్టారో దానికి తక్షణం 5000 వేల కోట్లు నిధులని మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. ఎస్ కలందర్, ఆర్.ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.