అచ్చెన్నకు గట్టి షాక్ ఇచ్చిన స్పీకర్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టి షాకే ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నపుడు పదే పదే అచ్చెన్న అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా స్పీకర్ నే డైరెక్ట్ చేసేట్లుగా కేకలేశారు. దాంతో ఒళ్ళుమండిపోయిన స్పీకర్ అచ్చెన్నకు సివియర్ వార్నింగ్ ఇవ్వటంతో మళ్ళీ నోరెత్తలేదు.

ప్రత్యేకహోదా అంశాన్ని చంద్రబాబునాయుడు ఎంతగా కంపు చేయాలో అంతా చేశారు. అదే విషయాన్ని జగన్ తన ప్రసంగంలో చెబుతున్నారు. దాన్ని సహించలేని ఈ మాజీ మంత్రి జగన్ ప్రసంగానికి అడ్డు తగిలారు. జగన్ మాట్లాడుతుంటే అచ్చెన్న రన్నింగ్ కామెంట్రీ ఇస్తునే ఉన్నారు.

తాము అధికారంలో ఉన్నపుడు జగన్ ప్రసంగానికి ఎలాగైతే అడ్డు తగిలారో ఇపుడు కూడా అదే చేద్దామని అనుకున్నారో ఏమో అచ్చెన్న ?  అచ్చెన్నకు మైక్ ఇవ్వకపోయేసరికి స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సిఎంకు చెప్పమని గట్టిగా అరిచారు.

దాంతో అచ్చెన్నపై స్పీకర్ మండిపోయారు. సభలో ఎవరు మాట్లాడాలి ? ఎవరు కాదు ? అనే విషయాలో తనకు ఇంకోరు చెప్పాల్సిన పనిలేదన్నారు. తననే డిక్టేట్ చేయాలన్న అచ్చెన్న మాటలను తప్పుపట్టారు. ఇంకోసారి ఇదే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో తర్వాత అచ్చెన్న నోరిప్పలేదు.