‘స్పందన’ బాధ్యతలు అమెకే…
రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు అంగీకరించారు. మరో నాలుగైదు రోజుల్లోనే ఈ డైనమిక్ అధికారి ఏపీ ముఖ్యమంత్రి టీంలో అధికారిగా చేరబోతున్నారు. ప్రజలతో మమేకం అయ్యే ఈ అధికారి కి ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న “స‌్పందన” పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఏపీకి రోహిణి ..జగన్ నిర్ణయం..
కొద్ది కాలం క్రితం ఈ పేరు అందరికీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు. కర్నాటకలో అధికార పార్టీ నేతలకే నిబంధన లను విస్మరిస్తే ముచ్చెమటలు పట్టించారు. దీంతో..పదేళ్ల ఐఏయస్ సర్వీసులో అనేక బదిలీలు ఎదుర్కొన్నారు. తమ కోసం పని చేసే అధికారిని బదిలీ చేయవద్దంటూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. రోహిణి సింధూరి తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లాలో పుట్టి…హైదరాబాద్‌లో పెరిగారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. కర్ణాటకలో పోస్టింగ్ అందుకు న్నారు. కర్నాటకలో వివిధ ప్రాంతాల్లో పని చేసిన సమయంలో కరువు రైతులకు పరిహారం విషయంలోనూ.. కొబ్బరి నీటితో కార్పోరేట్ వ్యాపారం చేయట ఎలాగో రైతులకు నేర్పించి వారి మనస్సుల్లో స్థానం సంపాదించారు. 2009 ఐఏయస్ బ్యాచ్‌కు చెందిన దాసరి రోహిణీ సింధూరి నెల్లూరుకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహమాడారు. ప్రజల సమస్యల మీద నిక్కచ్చిగా పోరాడే రోహిణీ సింధూరిని ఏపీకి రావాలని జగన్ కబురు చేయగా వెంటనే అంగీకరించారు. రెండు ప్రభుత్వాల మధ్య జరగాల్సిన ప్రక్రియ పూర్తయింది. ఇక, ఏపీలో బాధ్యతలు స్వీకరించటమే మిగిలింది.