ద‌శాబ్ధం త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ కోసం దిగిరాబోతున్న సోనియా గాంధీ??

YS Jagan special interest on West Godavari district 

వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబానికి- నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకున్న వైరం గురించి తెలిసిందే. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం వెనుక ఆ పార్టీ ఉంద‌నే ఆరోప‌ణ..జ‌గ‌న్ జైలు జీవితం..ఆ కుటుంబం ప‌డ్డ ఇబ్బందులు కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ అంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంతెత్తున లేచిప‌డ‌తారు. హ‌స్తం గుర్తుతోనే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా రెండుసార్లు గెలిచినా! జ‌గ‌న్ మాత్రం ఆ పార్టీని వ‌దిలేసి కొత్త‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ప్ర‌జల గుండె చ‌ప్పుడ‌య్యారు. మ‌హానేత మ‌ర‌ణం త‌ర్వాత రాష్ర్టంలో రాజ‌కీయ ప‌రిస్థితులే త‌ల్ల కిందులైపోయిన సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్ మ‌ర‌ణం రెండు రాష్ర్టాల ఏర్పాటుకు కార‌ణ‌మైంది. పిల్లిలా ఉన్నాడు పులైపోయాడు.

sonia gandhi
sonia gandhi

ప్ర‌త్యేక వాదుల ఒత్తిడితో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ర్ట‌మైంది. దీనంత‌టికీ కార‌ణం కాంగ్రెస్ పార్టీ. అలా తెలంగాణ ఏర్పాటు కావ‌డం..మ‌హానేత మ‌ర‌ణం..జ‌గ‌న్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించ‌డం అన్ని వేగంగా జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవ‌డం..బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం…ప్ర‌స్తుతం బ‌లంగా ఏర్పాటు కావ‌డం అన్ని చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఈ క‌థ‌ల‌న్నీ జ‌రిగి  దాదాపు ద‌శాబ్ధం పూర్త‌యింది. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కోసం సోనియా గాంధీ జ‌గ‌న్ తో భేటీ కానున్నారన్న ఓ వార్త తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు..మోదీ..షాల వ్యూహాం..జ‌మిలి ఎన్నిక‌లు తీసుకొస్తే త‌లెత్తే ప‌రిస్థితులు..రాజ‌కీయ ఇబ్బందుల గురించి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ భేటీకి జ‌గ‌న్ ఒప్పుకుంటారా? అస‌లు అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అన్న సందేహాలు రాక మాన‌వు. రాజ‌కీయంగా జ‌గ‌న్ ని ఎన్నో ఇబ్బందుల‌కు గురిచేసిన పార్టీ అది. అప్పుడు క‌య్యం పెట్టుకుని ఇప్పుడు వియ్యం అంటే అంగీక‌రిస్తారా? ఒక వేళ ఒప్పుకుంటే కాంగ్రెస్ తో జ‌గ‌న్ కి క‌లిసొచ్చేదేంటి? టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడులా పొత్తుల రాజ‌కీయాలు జ‌గ‌న్ చేస్తారా? చేయ‌గ‌ల‌రా? ఇలా చాలా సందేహాలు తెర‌పైకి వ‌స్తాయి.