రాయలసీమలో మారుతున్న పరిస్థితులు.. ఆ స్థానాల్లో కూడా గెలుపు కష్టమే!

Rajya Sabha Elections

రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలలో గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీదే హవా ఉండే ఛాన్స్ అయితే ఉంది. 2024 ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ కుప్పం, ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో మాత్రం ఈ మూడు స్థానాలలో కూడా టీడీపీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. పాపులారిటీ ఉన్న అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా వైసీపీ టీడీపీ ముఖ్య నేతలకు షాకివ్వాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన పార్టీలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

రాయలసీమలో పరిస్థితులు మారుతుండగా సీమ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సీమ ప్రజల హృదయాల్లో మాత్రం స్థానం సంపాదించుకోలేక ఫెయిలవుతున్నారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ రాయలసీమపై మాత్రం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ఇప్పటినుంచి అయినా ప్రజల మెప్పు పొందేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వాళ్లకు అవకాశాలను ఇస్తే మాత్రమే చంద్రబాబుకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తే మాత్రం టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం జన్మలో జరగదని చెప్పవచ్చు.