ఒకప్పుడు రామోజీరావు దగ్గరకు వెళ్ళి మరీ కలిశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయం అంటే ఇలాగే వుంటుంది. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులూ వుండరు. ఈనాడు నుంచి వైసీపీకి ఎప్పటికీ సపోర్ట్ దొరకదు. కానీ, వైఎస్ జగన్ తనవంతు ప్రయత్నమైతే చేశారు.
ఆ సంగతి పక్కన పెడితే, ప్రజారాజ్యం పార్టీ పాతరేయబడటానికి కారణం రామోజీరావు. ప్రజారాజ్యం పార్టీ మీద ఈనాడులో వచ్చిన వెటకారపు, వెకిలి కథనాలు అన్నీ ఇన్నీ కావు. యెల్లో మీడియా అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పతనం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసింది. అలాంటి యెల్లో మీడియాలోని ‘ఈనాడు’ అధినేత రామోజీరావుని ‘మార్గదర్శి’ కేసులో సీఐడీ విచారిస్తే, ఈ క్రమంలో సోషల్ మీడియాలో రామోజీరావుపై పెద్దయెత్తున కామెంట్లు పడుతోంటే, జనసేన నేత నాగబాబుకి మనసు చివుక్కుమంది.
రామోజీరావు గొప్పతనాల్ని పేర్కొంటూ ట్వీట్లేశారు నాగబాబు. పెద్ద పెద్ద పురస్కారాలు పొందినోళ్ళంతా గొప్పోళ్ళు కాదు. జనసేన మీద ఇప్పటికీ యెల్లో మీడియా విషం చిమ్ముతూనే వుంది. ఈనాడు కూడా అందులో వుంది. ఆ ఈనాడు అధినేత రామోజీరావు.
ఇక, నాగబాబు అమితమైన ప్రేమాభిమానాల్ని రామోజీరావు మీద కురిపించేయడం జనసైనికులకు అస్సలు నచ్చడంలేదు.