నటి శ్రియా నడి రోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్ లో భాగంగా కాదు. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి ఫారిన్ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంలో ఆమె అందరితో కలిసి రోడ్డు మీదనే డాన్స్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.
ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియోలు, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. శ్రియా గతేడాది రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్విన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్ లో నటించిన నరకాసురన్ విడుదలకు సిద్దమవుతుండగా హిందీలో తడ్కా అనే చిత్రంలో నటిస్తుంది.