జనంలోకి జనసేనాని.! కానీ, ఇది సరిపోదు.!

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చారు.! జస్ట్ చుట్టపు చూపు మాత్రమే అనుకోవాలేమో.! కళ్ళకి బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్నారు.. వైట్ అండ్ వైట్ డ్రస్సులో సినిమా షూగింగ్ కోసమే.. అన్నట్టుగా హంగామా చేశారు.

కానీ, విషయం వేరే.! అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యం, దెబ్బ తిన్న ఇతర పంటల వల్ల కష్టాల పాలైన రైతుల్ని పరామర్శించేందుకు, వారిని ఓదార్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళారు.

షరామామూలుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అభిమానుల అత్యుత్సాహం పవన్ కళ్యాణ్‌కి ఒకింత చికాకు కలిగించింది కూడా.! ‘ఆగండ్రా బాబూ..’ అంటూ అభిమానుల మీద పవన్ కళ్యాణ్ స్వయంగా అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది.

మరోపక్క, వైసీపీ సర్కారు.. రికార్డు సమయంలో రైతుల్ని ఆదుకున్నామని చెబుతోంది. రైతులేమో, ప్రభుత్వం తమను అస్సలు పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇంతకీ ఏది నిజం.? సరే, పరామర్శించారు.. ఓదార్చారు.. వాట్ నెక్స్‌ట్.? పవన్ కళ్యాణ్ తదుపరి రాజకీయ కార్యాచరణ ఏంటి.?

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి గ్లింప్స్ రాబోతోంది. సో, సినిమా సందడి. ‘ఓజీ’ ఫూటింగ్ మేజర్ షెడ్యూల్ ఫినిష్ అయ్యింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూట్‌కి వెళ్ళబోతున్నారు. అంతే.! సినిమా షూటింగుల మధ్య చిన్న గ్యాప్ తీసుకుని జనంలోకి వెళుతున్నారు జనసేనాని.