షాకింగ్: జగన్ పై సీబీఐ కేసులో కీలక ట్విస్ట్!

ప్రస్థుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతి పార్టీకి మద్దతిచ్చే ఒక న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్ ఉండటం సహజం. అలాగే టీడీపీకి మద్దతిచ్చే ఒక పత్రికలో వచ్చిన ఒక కథనం జగన్ సీబీఐ కేసులో కీలక విషయాలను బయటపెడ్తూనే చంద్రబాబుకు చిక్కులు తెచ్చింది. ఆ పత్రిక అధినేత తాజాగా పత్రికలో కథనం రాస్తూ…మాజీ జస్టిస్ ఈశ్వరయ్య లీకైన టేప్స్ గురించి, వైసీపీ నాయకులు వేసిన పథకం గురించి తన అభిప్రాయాలను వెళ్లబుచ్చాడు.

ప్రస్థుతం వైసీపీ హయాంలో ఏపీ ఉన్న‌త విద్యా నియంత్ర‌ణ క‌మిష‌న‌ర్ గా విధులు వ్యవహరిస్తున్న ఈశ్వరయ్య చేత హై కోర్టు, సుప్రీం కోర్ట్ జడ్జ్ ల పరువు భంగం కలిగేలా వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఇంత వరకు బానే ఉంది. అయితే ఆ అధినేత ఇంకొంచెం ముందు వెళ్లి ఈశ్వరయ్యను హై కోర్టు జడ్జ్ గా నియమించింది గత ముఖ్యమంత్రి చంద్రబాబేనని, జగన్‌ రెడ్డిపై సీబీఐ దర్యాప్తు జరగడానికి కూడా జస్టిస్‌ ఈశ్వరయ్య కారణమని, జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను ఆయన ఇనిషి యేట్‌ చేశారని ఆ తర్వాత సదరు పిల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించిందని వెల్లడించారు.

అయితే ఈ కథనం చదివిన పాఠకులు మాత్రం ఆ పత్రిక అధినేత యొక్క మూర్ఖత్వానికి నవ్వుతున్నారు. ఎందుకంటే ఇన్ని ప్రజలు జగన్ పై సీబీఐ విచారణ వెనక ఎవరి కుట్ర లేదని, ఆయన చేసిన తప్పులే కారణమని చాలామంది నమ్మారు. అయితే ఇప్పుడు ఈ కథనం ప్రకారం జడ్జ్ ను చంద్రబాబే నియమించాడు కాబట్టి కావాలనే జగన్ ను కేసులో ఇరికించారని అనుకుంటున్నారు. అయితే టీడీపీకి అనుకూలంగా కథనం రాయడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది బెడిసికొట్టింది. ఇన్నాళ్లు జగన్ కేసులో ఈ కీలక అంశాన్ని ఇన్నాళ్లు ఎవ్వరూ ఎందుకు భయటపెట్టలేదని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ కథనం ద్వారా తమ నాయకుడి నిజాయితీ మరోసారి బయటపడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.