షాకింగ్ టాక్ : పవన్ మళ్ళీ సినిమాలు ఆపేస్తున్నాడా??

Pawan Movie

టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరని తెలిసిందే. అయితే పవన్ ఇప్పుడు రాజకీయాలు అలాగే సినిమాల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు రాజకీయాలపై ఫోకస్ చెయ్యడంతో పవన్ సినిమాలకి దూరం ఎక్కువ అవుతుంది.

ఆల్రెడీ సెట్స్ పై ఒక సినిమా ఉండగా అది ఇప్పుడు మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. దర్శకుడు క్రిష్ తో పవన్ చేస్తున్న ఆ సినిమానే “హరిహర వీరమల్లు”. భారీ స్థాయి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీని తర్వాత ఒక రీమేక్ అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్” అనే బిగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది.

అయితే పవన్ కెరీర్ లో గతంలోనే ఓసారి ఇక సినిమాలు చేయను అని ఆపేస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మళ్ళీ రాజకీయాల్లో ఉంటూనే చేసుకోవచ్చి అభిమానులు తన అన్నయ్య కోరిక మేరకు వచ్చాడు. కానీ ఇపుడు మళ్ళీ పవన్ సినిమాలు ఆపేసుకోవాలని చూస్తున్నాడని షాకింగ్ టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది.

అయితే ఇది నిజమే అన్నట్టుగా తెలుస్తుంది. హరీష్ శంకర్ తో సినిమా భవదీయుడు భగత్ సింగ్ పూర్తయ్యాక పవన్ మళ్ళీ సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ రాజకీయ పనుల్లో బిజీగా ఉండే కారణం చేత ఈ నిర్ణయం పవన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక వచ్చే ఏడాది నుంచి పవన్ సినిమాలు ఆపడం కన్ఫర్మ్ అని చెప్పాలి.