వైఎస్సార్ కళ్యాణమస్తుకు ఇన్ని షరతులా.. చంద్రబాబు ప్రభుత్వమే మేలు కదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మంచి పథకాలనే అమలు చేస్తున్నా ఆ పథకాలకు సంబంధించి అమలు చేస్తున్న నిబంధనల విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత జగన్ సర్కార్ వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అయితే వధువు కచ్చితంగా పదో తరగతి పాసై ఉండాలని జగన్ సర్కార్ నిబంధనలను చేర్చింది.

ఆడపిల్లలు చదువుకోవాలనే ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నామని జగన్ సర్కార్ చెబుతున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. జగన్ సర్కార్ ఖర్చును తగ్గించుకోవాలనే ఆలోచనతోనే ఈ దిశగా అడుగులు వేసిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ నిబంధనతో పాటు ఇతర పథకాల విషయంలో అమలవుతున్న నిబంధనలను కూడా ఈ పథకానికి అమలు చేయనున్నారని తెలుస్తోంది.

ఈ విషయాలు తెలిసి వైఎస్సార్ కళ్యాణమస్తుకు ఇన్ని షరతులా అని సామాన్య ప్రజల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇన్ని నిబంధనలను అమలు చేస్తే జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేసినా పెద్దగా లాభం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఈ స్కీమ్ అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయడం గమనార్హం.

టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో కేవలం రేషన్ కార్డ్ ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేసిందని జగన్ సర్కార్ కూడా ఆ విధంగా అమలు చేసి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.