తారకరత్న మరణం.. టీడీపీకి నందమూరి ఫ్యామిలీకి తీరని లోటే అంటూ?

నందమూరి కుటుంబంలో వివాదాలకు అతీతంగా పాపులారిటీని సంపాదించుకున్న వ్యక్తులలో తారకరత్న ఒకరు. తారకరత్న అకాల మరణం అభిమానులను ఊహించని షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తారకరత్న గురించి ఇండస్ట్రీలో అందరూ మంచిగా చెప్పుకుంటారు. తారకరత్న మరణం టీడీపీకి నందమూరి ఫ్యామిలీకి తీరని లోటేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తారకరత్న బ్రతికి ఉంటే టీడీపీలో సంచలనాలు నమోదై ఉండేవని కొంతమంది చెబుతున్నారు. గతంలో చాలా సందర్భాల్లో టీడీపీ తరపున తారకరత్న ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. మెదడులో రక్తప్రసరణ జరగకపోవడం వల్లే తారకరత్న మృతి చెందారని తెలుస్తోంది. ఈయన మరణవార్త విని నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందనే సంగతితెలిసిందే. బాబాయ్ బాబాయ్ అని పిలిచే తారకరత్న పిలుపే వినపడదంటే తట్టుకోలేకపోతున్నామని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన తారకరత్నకు అదృష్టం కలిసిరాకపోవడం వల్ల సరైన విజయాలు దక్కలేదు. సరైన సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో జరిగిన పొరపాట్లు సైతం తారకరత్న కెరీర్ కు శాపంగా మారాయి. స్టార్ హీరో కావాల్సిన తారకరత్న సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తారకరత్న సినిమాల్లోకి వచ్చారని ప్రచారం జరిగింది.

ఈ ప్రచారం నిజం అని తారకరత్న ఎప్పుడూ చెప్పలేదనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తారకరత్న పాజిటివ్ గా ఉండేవారు. రాజకీయాల్లో సక్సెస్ సాధించి ఎన్నో విజయాలను అందుకోవాలని భావించిన తారకరత్నకు ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదనే సంగతి తెలిసిందే.