పురుగుల మందు తాగబోయిన కాంగ్రెస్ నేత

ఏపీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నెల్లూరు రూరల్ నియోజక వర్గానికి చెందిన నేత శివాచారి హల్ చల్ చేశాడు. నెల్లూరు రూరల్ పరిధిలో పార్టీ కోసం అరకోటి ఖర్చు పెట్టానని చెప్పాడు. నెల్లూరు రూరల్ టికెట్ ఇప్పిస్తానని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పనబాక క్రిష్ణయ్య  చెప్పి మోసం చేశారంటూ ఆయన ఆరోపించాడు.

ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, సమావేశంలో ఉన్న ఇతర నేతలు ఆయన మీద పడి, పురుగుల మందుబాటిల్ లాక్కెున్నారు. కనీసం  రూరల్ ఇంచార్జి పదవి ఇవ్వకపోతే పార్టీ ఆఫీస్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.

ఇపుడు నెల్లూరు రూరల్ నియోజవర్గానికి వైసిపి నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి బాగా  బలమయిన అభ్యర్థి. అయినా సరే శివచారి ఈ టికెట్ ఆశిస్తున్నారు. 

శివాచారి

నేను పార్టీ కోసం చాలా కష్ట పడ్డాను. యాభై లక్షల వరకు ఖర్చు పెట్టాను. నాకు అన్యాయం జరిగిందంటూ న్యాయం జరిపించాలి అంటూ ఆందోళనకు దిగాడు. నాకు రూరల్ ఇంచార్జి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. నాకు న్యాయం జరగాలి అంటూ నినాదాలు చేశాడు శివాచారి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మేము న్యాయం జరిగేలా చూస్తాము అంటూ హామీ ఇచ్చి శివాచారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.