వేరే పనేమీ లేకుండా పోయింది ఏబీఎన్ రాధాకృష్ణకి. కేవలం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూనే తన మీడియా సంస్థల్ని తిప్పుతున్నాడాయన గత కొన్ని రోజులుగా. న్యూస్ ఛానల్‌లో వేరే కార్యక్రమాలకు స్కోప్ చాలా తక్కువ ఇస్తున్నారు. పత్రిక నిండా అవినాశ్ రెడ్డి వార్తలే.
దేనికోసమీ బరితెగింపు.? కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేస్తే, చేయొచ్చుగాక.! అది వేరే చర్చ. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఎన్నిసార్లయినా ఆశ్రయించే అవకాశం నిందితులకు వుంటుంది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆ వెసులుబాట్లను వినియోగించుకుంటున్నారు. ఇందులో వింతేముంది.?
సరైన సాక్ష్యాధారాలు సీబీఐ చేతిలో వుంటే, ఈపాటికే అవినాశ్ రెడ్డి అరెస్టయి వుండేవారు. ఆయన అరెస్టవలేదంటే, బలమైన సాక్ష్యాలు సీబీఐ వద్ద లేనట్టే కదా.! తొందరపడి అరెస్టు చేస్తే, రేప్పొద్దున్న రిమాండ్ కోసం సీబీఐ బలమైన వాదన వినిపించే అవకాశం వుండదు.
వైసీపీ శ్రేణులు అడ్డుకుంటే సీబీఐ భయపడుతుందా.? ఈ విషయంలో వైసీపీ కూడా కొంత అతి చేస్తున్న మాట వాస్తవం. అది టీడీపీ అను‘కుల’ మీడియాకి బాగా ఉపయోగపడుతోంది. మరీ ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. బాగా వాడేసుకుంటోంది. అరెస్టూ లేదు.. బొంగూ లేదు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సిగ్గు లేదు.. అంటూ సెటైర్లు పడుతున్నాయ్ సోషల్ మీడియాలో. పడతాయ్ మరి.! పైత్యం అలా వుంది.