ఎన్టీఆర్ వర్దంతి రోజున ఆయన భార్య లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శుక్రవారం ఎన్టీఆర్ 23 వర్ధంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే…
“విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదు. ఆయన ఆత్మ ఘోషిస్తోంది. ఎన్టీఆర్ ను చంపిన వాళ్లు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. నా గుండెలో మంట ఇంకా చల్లారలేదు. కన్నీరు ఆరలేదు. ఎన్టీఆర్ మహిళలను గౌరవిస్తే… ప్రస్తుతం టిడిపి మహిళలను అవమానిస్తోంది. మోసం చేసిన వారే అధికారం అనుభవిస్తున్నారు” అని లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీపార్వతి చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందన్న చర్చ జరుగుతోంది.