ఏపీ లో మరో ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాలకు ఈనెల 25న నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపింది. మార్చి 4వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, మార్చి 5న నామినేషన్ల పరిశీల, మార్చి 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు గడువు ఇచ్చింది.
మార్చి 15న పోలింగ్ అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఖాళీ అయిన స్థానాల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయింది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సుధారాణి, వీర వెంకన్న చౌదరిల పదవీ కాలం మార్చి 29 కి ముగియనుంది. మొత్తం 6స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మార్చి 15న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును ప్రకటించారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన కాగా, మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు.