జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్లు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ 67 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలలో గెలవడం కష్టమని జనసేన లీగల్ సెల్ సమావేశంలో వెల్లడించారు. జగన్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అలాంటి ప్రభుత్వానికి చట్టాలు చేసే హక్కు ఎక్కడ ఉందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పెద్దల సూచనల మేరకు తాను టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ అన్నారు.
తాను రాజకీయాల్లోకి రావడమే నేను చేసిన మంచి పని అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకు మాత్రమే తాను మద్దతు ఇస్తానని పవన్ తెలిపారు. అయితే జనసేన ఎన్ని స్థానాలలో గెలుస్తుందో కూడా పవన్ చెప్పి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారో లేదో స్పష్టం చేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అయితే గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తానన్న పవన్ 2019 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారని మరి పవన్ తనకు తాను టికెట్ ఇచ్చుకుంటారా లేదా అని కొంతమంది సెటైర్లు వేస్తుండగా ఆ సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన 2024 ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు అందుకునే ఛాన్స్ లేదని అభిప్రాయాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఈ విధంగా చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ పార్టీని ఎప్పటికి బలోపేతం చేస్తారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.