ప్రధాన చీఫ్ జస్టిస్ చేతిలో సాక్షి మీడియా భవిష్యత్తు ??

sakshi TV

వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల కంటే కూడా హై కోర్ట్, కోర్ట్ లంటేనే ఎక్కువ భయం పట్టుకుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎదుర్కొనన్ని అడ్డంకులు వైసీపీ ప్రభుత్వం కోర్ట్ ల నుండి ఎదుర్కొంటుంది. దాదాపు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు కోర్ట్ చుట్టూనే తిరుగుటున్నాయి. అయితే ఇప్పుడు తాజగా మరో వివాదం ప్రభుత్వాన్ని చుట్టుకోనుంది. ఈ దెబ్బకు వైసీపీతో పాటు జగన్ కు అనుకూలంగా ఉన్న సాక్షి పత్రికకు కూడా షాక్ తగలనుంది. ఇలాంటి వివాదం ఒకటి ప్రభుత్వాన్ని చుట్టుకుంటుందని వైసీపీ ప్రభుత్వం అసలు ఊహించి కూడా ఉండదు.

Sakshi
Sakshi

సాక్షి టీవీ, పత్రికకు ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా పత్రికా ప్రకటనలు ఇస్తున్నారంటూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍ ను జస్టిస్ రాకేశ్‍కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‍ను ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి బెంచ్‍కు బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రకటనలను వైసీపీ జెండాను పోలిన రంగులతో ప్రచురిస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు పార్టీకి సంబంధం లేకుండా ఉండాలి కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు మాత్రం వైసీపీ జెండా రంగులు పోలి ఉంటున్నాయి. దీంతో ఈ ప్రజా వ్యాజ్యం దాఖలైంది. కోర్ట్ నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇప్పుడు మరో విపత్తును ఎదుర్కోనుంది. వైసీపీ  నాయకులు చేస్తున్న అనాలోచిత పనులకు సాక్షి భవిష్యత్తు కూడా ఇప్పుడు జడ్జ్ చేతిలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని కోర్ట్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సాక్షి భవిష్యత్ ఏమవుతుందో, వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ఎలాంటి చిక్కు వస్తుందో వేచి చూడాలి.