అప్పుడు జగన్, కేసీఆర్ చేసి చూపించారు ..ఇప్పుడు మీరు చూపించండి చంద్రబాబు

chandrababu did a multiple mistakes in ghmc elections

అమరావతి ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న కారణంగా జనభేరిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ ‌కు ఓ సవాలు విసిరారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని, లేదంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలని, ఇందుకు జగన్‌ సిద్ధమేనా అని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు.

sajjala fires on chandrababu

ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్‌ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్ ‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే’ అని సజ్జల చెప్పారు.

వారి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లారు. వైఎస్ జగన్ ‌గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెబుతోన్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా అని అయన కౌంటర్ ఇచ్చాడు.