ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మాట నెగ్గించుకున్నారు. మాట ఇస్తే వెనక్కి తగ్గననే స్వభావాన్ని నిలుపుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతటి స్థాయిలో ఆందోళనలు జరిగే వెనక్కు తగ్గలేదు. ముందుగా చెప్పినట్లే విశాఖపట్నానికి సచివాలయాన్ని, వివిధ ప్రభుత్వ శాఖల హెడ్ ఆఫీసులకు తరలించాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన రాష్ర్ట కేబినెట్ సమావేశాల్లో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణపై దృష్టి పెట్టారు. అమరావతిలో మూడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అమరావతి కేంద్రంగా అమలవుతున్న సీఆర్‌డీఏని ఉపసంహరించుకొని మూడు వికేంద్రీకరణ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కర్నూల్‌లో హైకోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులను సంతృప్తి పరచాలని నిర్ణయించారు. అక్కడ భూములిచ్చిన రైతులకు కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పొడిగించారు. హైపర్ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది.
దూకుడు పెంచిన జనసేన
బీజేపీ-జనసేన పొత్తుతో రాష్ర్టంలో కొత్తవాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆపార్టీ నేతలు , కార్యకర్తలు నిరాశ చెందారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పార్టీ నేతల్లో రాజధాని విషయం కదలిక తెచ్చింది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్న జనసేన అధినాయకుడు ఒక అడుగు ముందుకు వేశాడు. ఏకంగా బీజేపీ తోనే పొత్తుకు సిద్ధమయ్యాడు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని జనసేన నేతలు చెబుతున్నారు. పైగ ఒకడుగు ముందుకేసి బీజీపీతో పొత్తు రాష్ర్టానికే లాభం అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికలను తాము ఎంతో కిలకంగా భావిస్తున్నామని చెబుతున్నారు. సమకాలీలన రాజకీయాలపై జనసేనకు పట్టు లేదని అది ఒక విఫలప్రయోగమని వైసీపీ లాంటి పార్టీలు చేస్తున్న విమర్శలను వారు తిప్పికొడుతున్నారు.
పవన్‌కు భద్రత ప్రజాదరణ కలిగిన నేత పవన్‌కళ్యాణ్‌కు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భద్రత ఇవ్వాలని కేంద్రం నుంచి రాష్ర్టానికి సందేశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ పలు వివాదస్పద నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమయంలో ఏపీలో ఆపార్టీతో జనసేన పొత్తు పెట్టకుంది. ముందుముందు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనబాహుళ్యంలోకి వెళ్ఠే సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఆయన భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తొంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు చెందిన 8 ప్లస్ 8 సెక్యురిటీ నియమించనున్నట్లు సమాచారం.