AP: పెరిగిన విద్యుత్ చార్జీలపై రోజా సంచలన వ్యాఖ్యలు…. బాబు షూరిటీ లేదు భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు?

AP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రచార కార్యక్రమాలలో రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేస్తానని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు చార్జీలను పెంచే ప్రసక్తే లేదు అంటూ చెప్పిన బాబు అధికారులకు వచ్చిన తర్వాత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలను పెంచే ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారు అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 27వ తేదీ పెరిగిన విద్యుత్ చార్జీలపై నిరసన తెలియజేస్తూ ర్యాలీలు చేయాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే డిసెంబర్ 27వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా కూటమి నేతలపై అలాగే చంద్రబాబు అబద్ధపు హామీల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై సుమారు 15 వేలకోట్ల అదనపు భారం పడుతుందని వైసీపీ నాయకులు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ ఈమె మండిపడ్డారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని అదే అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ లేదు భవిష్యత్తుకు కూడా గ్యారెంటీ లేకుండా పోయింది అంటూ రోజా ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.