“భూ అక్రమార్కులను వదిలి పెట్టను “.. రోజా

“భూ అక్రమార్కులను వదిలి పెట్టను “.. రోజా

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ . చంద్ర బాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ చేసిన అక్రమాలు , అవినీతిని వెలుగులో తీసుకొస్తామని, వారు పెద్ద ఎత్తున దోచుకున్నారని , వాటన్నింటినీ తిరిగి వసూలు చేస్తామని రోజా సంచలన ప్రకటన చేశారు . గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా భూ కేటాయింపులు చేసిందని , వాటి రికార్డులను పరిశీలిస్తామని , ఎవరినీ వదిలి పెట్టమని రోజా పేర్కొన్నారు .

వై .సి .పి శాసన సభ్యురాలు ఆర్ .కె . రోజా తన భర్త సెల్వమణితో కలసి సోమవారం రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా రోజా గత ప్రభుత్వం చేసిన అవక తవకలు , అక్రమాల గురించి దృష్టి పెడుతున్నట్టు తెలిపారు . చంద్ర బాబు , ఆయన కుమారుడు లోకేష్ పెద్ద ఎత్తున తమకు కావలసిన వారికి అడ్డ దారిలో దోచిపెట్టరాని అందరికీ తెలుసు , సంస్థ ఎండీ నేతృత్వంలో వీటిపై విచారణ సాగుతుందని , చంద్ర బాబు , లోకేష్ చేసిన భూ కేటాయింపుల పై కూడా పరిశీలన ఉంటుందని రోజా చెప్పారు .

రోజా మొదట తెలుగు దేశం పార్టీలో పనిచేశారు . జగన్ మోహన్ పార్టీ పెట్టిన తరువాత ఆమె వై . ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . గతంలో ఆ పార్టీ తరుపున నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందారు . అప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం రోజాను అనేక ఇబ్బందులను పెట్టింది . మానసికంగా వేధించింది . శాసన సభ సాక్షిగా అవమానించింది … సభ నుంచి పంపించివేసింది . కాబట్టి రోజా ఆ ఘటనలు మర్చిపోలేదు .

ఇప్పుడు పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్మన్ గా నియమితురాలైన రోజా ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై దృష్టి పెట్టింది . చంద్ర బాబు , అయన కుమారుడు లోకేష్ చేసిన కేటాయింపులపై విచారణ చేపట్టడం ఇప్పుడు తెలుగు దేశం శ్రేణులకు మింగుడు పడటం లేదు . ఇది చంద్ర బాబు , లోకేష్ ఇద్దరికీ ఇబ్బందికమైన పరిస్థితే . రోజా తనకు వచ్చిన అవకాశాన్ని … గతంలో జరిగిన దానికి ప్రతీకారంలా వాడుకుంటుందా ?