కసి తీర్చుకున్న ఫైర్ బ్రాండ్

చంద్రబాబునాయుడుపై తనకున్న కసంతా తీర్చేసుకుంది ఫైర్ బ్రాండ్ రోజా. అసెంబ్లీలో మాట్లాడిన రోజా అనేక అంశాలపై చంద్రబాబు దుమ్ము దులిపేసింది. కాల్ మనీ సెక్స్ రాకెట్, ఫిరాయింపులు, తనను ఏడాది పాటు సస్పెండ్ చేయటం, ఎన్టీయార్ కు వెన్నుపోటు తదితర అంశాలపై చంద్రబాబును గట్టిగా  నిలదీసింది.

రోజా అసెంబ్లీలో మాట్లాడి దాదాపు మూడేళ్ళు అయిపోయింది. 2014లో ఏర్పడిన 14వ అసెంబ్లీలో ఏడాది దాటగానే కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై మాట్లాడినపుడు నిబంధనలకు విరుద్ధంగా  రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం అసెంబ్లీకి వచ్చినా వైసిపి ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించిన కారణంగా దాదాపు రెండేళ్ళు అసలు అసెంబ్లీ మెట్లే తొక్కలేదు.

అన్నీ కలిపి సుమారుగా రోజా అసెంబ్లీలో తన గొంతు వినిపించి మూడేళ్ళయ్యిందనే చెప్పాలి. రోజాను ఎట్టి పరిస్ధితుల్లోను అసెంబ్లీ మెట్లెక్కనీయకూడదనే చంద్రబాబు అనైతిక చర్యలకు పాల్పడ్డారన్నది వాస్తవం. అలాంటి చంద్రబాబు ఇపుడు సభా సంప్రదాయాలు, ధర్మాలు, నిబంధనల గురించి మాట్లాడినపుడు రోజా ఒక్కసారిగా రెచ్చిపోయింది.

ఒక్కో అంశాన్ని సూటిగా ప్రస్తావిస్తు చంద్రబాబును రోజా కడిగిపారేసింది.  మాట్లాడింది పది నిముషాలే అయినా రోజా ధాటిగా మాట్లాడింది. రోజా మాట్లాడితే ఎలాగుంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడిన రోజా చంద్రబాబును కార్నర్ చేయటమే కాకుండా తన కసినంతా తీర్చేసుకుందనే చెప్పాలి.