రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి వస్తాడా.?

ముసుగులో గుద్దులాట ఏమీ లేదు.! ఇక్కడంతా బహిరంగ రహస్యమే. సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి. ఆ పార్టీ కోసమే గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమా తీశాడు. ఇప్పుడేమో ‘వ్యూహం’ సినిమా తీస్తున్నాడు.

తాజాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రామ్ గోపాల్ వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘వ్యూహం’ పేరుతో తీస్తున్న సినిమా విశేషాల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో రామ్ గోపాల్ వర్మ చర్చించాడట.

అంతే కాదు, ‘నిజం’ పేరుత నిర్వహిస్తోన్న యూ ట్యూబ్ ఛానల్, ఆ కంటెంట్ వ్యవహారాల గురించి కూడా వర్మ – వైఎస్ జగన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న దరిమిలా, రామ్ గోపాల్ వర్మ సేవల్ని పార్టీ కోసం మరింతగా వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట.

‘బయట నుంచి ఎందుకు.? పార్టీలోకి వచ్చేయొచ్చుగా..’ అని వైఎస్ జగన్ రామ్ గోపాల్ వర్మని కోరారంటూ ఓ లీకు బయటకు వచ్చింది. ఇది వర్మ ఇచ్చిన లీక్ అనుకోవాలా.? అంతేనేమో.!

పోయి పోయి.. రామ్ గోపాల్ వర్మని వైసీపీలో జగన్ చేర్చుకుంటారా.? అవకాశమే లేదు. బయట నుంచి మాత్రమే ఆయన సేవలు పార్టీకి అందించేలా వైఎస్ జగన్ వ్యూహ రచన చేస్తారు తప్ప.. ఆయన్ని వైసీపీలోకి రానివ్వరేమో.!

మరోపక్క, కొందరు వైసీపీ నేతలు మాత్రం, వర్మని వైసీపీలోకి తీసుకురావడమే బెటర్.. అని అంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలిక.!