జగన్మోహన్ రెడ్డి చెబుతున్న రివర్స్ టెండర్ ఎఫెక్ట్ అప్పుడు పనిచేయటం మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. రివర్స్ టెండర్ ద్వారా కాంట్రాక్టు ధరలను తగ్గించే ఉద్దేశ్యంతో జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీ చేస్తుండగా ప్రాజెక్టుకు గేట్లు పెట్టే పనులను బెకెమ్ కంపెనీ చేస్తోంది.
రివర్స్ టెండర్ల ద్వారా పై పనులు చేపట్టేందుకు కంపెనీలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రంగం రెడీ చేస్తోంది. మరో నాలుగు రోజుల్లో టెండర్ ప్రక్రియను రెడీ చేసి నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ నేపధ్యంలో బెకెమ్ కంపెనీ రంగ ప్రవేశం చేసింది. గేట్లు తయారీ ప్రాజెక్టును తమకే అప్పగిస్తే గతంలోని ధరలకన్నా 8 శాతం తక్కువకే చేస్తామంటూ పెద్ద ఆఫరే ఇచ్చింది. వందల కోట్ల పనుల్లో 8 శాతం తక్కువకే చేయటమంటే చిన్న విషయం కాదు. ఉదాహరణకు రూ. 100 కోట్ల పనుల్లో 8 శాతమంటే దగ్గర దగ్గర 8 కోట్లు మిగులుతుందన్నమాట.
ఈ లెక్కన ప్రాజెక్టుల్లో పనులన్నీ వేల కోట్ల రూపాయల విలువైనవే. అంటే తక్కువలో తక్కువ వందల కోట్లు ప్రభుత్వానికి మిగులుతందనటంలో సందేహం లేదు. సరే అధికారులు మాత్రం టెండర్ ప్రక్రియ ద్వారానే పనులను దక్కించుకోవాలంటూ సూచించారు లేండి. మరి చూద్దాం బెకెమ్ కంపెనీ ఏం చేస్తుందో ?