రేవంత్ రెడ్డి కోవర్టు అయితే.. రోజా ఏంటి.?

Revanth Reddy Is Tdp Covert, What About Roja

రాజకీయాలన్నాక నాయకులు పార్టీలు మారడం. సిద్ధంతాలు, వంకాయలూ ఏమీ వుండవిక్కడ. అధికారం కోసం ఎటైనా దూకుతారు రాజకీయ నాయకులు. దాన్ని తప్పు పట్టలేం కూడా. టీడీపీ నేతగా ఒకప్పుడు బీభత్సమైన రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్నరు. చంద్రబాబు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే. కేసీయార్, తెలుగుదేశం పార్టీ నుంచి వేరుపడి.. కొత్త రాజకీయ కుంపటి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ ఉద్యమ నినాదంతో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే. నాయకులు పార్టీలు మారినంతమాత్రాన కోవర్టులైపోరు కదా.? సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, టీడీపీ కోవర్టుగా అభివర్ణించారు. తెలంగాణ రాజకీయాలతో రోజాకి ఏంటి సంబంధం.? అయినాగానీ, ఆమె రేవంత్ రెడ్డి మీద సెటైర్లు వేశారు.

దానికి కౌంటర్ ఎటాక్ రేవంత్ వర్గం నుంచి కూడా గట్టిగానే వస్తోంది. అసలే రేవంత్ సైన్యం సోషల్ మీడియాలో వెరీ వెరీ యాక్టివ్. ‘రేవంత్ కోవర్టు అయితే రోజా కూడా కోవర్టే కదా.. జర జాగ్రత్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారూ..’ అంటూ రేవంత్ సైన్యం సోషల్ మీడియా వేదికగా సెటైర్లు దంచేస్తోంది. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు.. అదేనండీ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా రోజా పనిచేశారు. ఇప్పడామెను చంద్రబాబు విమర్శిస్తున్న తీరుకి పది రెట్లు అభ్యంతరరంగా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తెలుగు మహిళ అధ్యక్షురాలి హోదాలో విమర్శించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? రేవంత్ విషయంలో రోజా మాట్లాడిందే నిజమైతే, రాజకీయాల్లో వున్నోళ్ళంతా కోవర్టులేనని అనుకోవాలేమో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles