జనసేనను ప్రజలు నమ్మకపోవడానికి అసలు కారణాలివే.. అవే తప్పులు అంటూ?

Pawan Kalyan

2014 ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. 2014 ఎన్నికల్లోనే పవన్ పోటీ చేస్తారని ఫ్యాన్స్ భావించినా అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతిచ్చారు. పవన్ మద్దతివ్వడంతో పవన్ అభిమానులంతా జనసేనకు అనుకూలంగా ఓట్లు వేయడం గమనార్హం. టీడీపీ 2014లో అధికారంలోకి రాగా టీడీపీ చేసిన తప్పులను జనసేనాని మెజారిటీ సందర్భాల్లో విమర్శించలేదు.

2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం అటు టీడీపీకి ఇటు జనసేనకు మైనస్ అయింది. అయితే 2024 ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉన్నా జనసేన పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించకపోవడం ఆయనకు ఒకింత మైనస్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ కారణం వల్ల జనసేనకు అనుకూలంగా ఓట్లు వేయలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీపై విమర్శలు చేయకపోవడంతో టీడీపీ, జనసేన ఒకటే అనే భావన ప్రజల్లో ఉంది. అదే సమయంలో బీజేపీ, జనసేన పార్టీలు 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయో లేక విడిగా పోటీ చేస్తాయో ఆ పార్టీ నేతలకే క్లారిటీ లేదు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా చిన్నచిన్న తప్పులు పార్టీకి మైనస్ అయ్యాయి. పవన్ విజయావకాశాలపై చేస్తున్న సర్వేల ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారో ప్రకటించి ఇప్పటినుంచి పార్టీ గెలుపు దిశగా ప్రయత్నాలు మొదలుపెడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.