చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి పవన్ కారణమా.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం వెనుక ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారనే సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ప్రజారాజ్యం పార్టీకి 2009 ఎన్నికల్లో పరవాలేదనే రేంజ్ లో ఫలితాలు వచ్చాయి. అయితే చిరంజీవి వెనుక ఉన్న కొంతమంది చేసిన రాజకీయాల వల్ల పెద్దగా సంచలనాలు సృష్టించకుండానే కాంగ్రెస్ లో విలీనంతో ప్రజారాజ్యం కథ ముగిసింది.

అయితే 2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా చిరంజీవి చేసిన కామెంట్లను గమనిస్తే చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి పవన్ పరోక్షంగా కారణమయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి తాజాగా మాట్లాడుతూ నేను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్ గా ఉండటం నా తమ్ముడికి హెల్ప్ అవుతుందని భావించానని అన్నారు.

అంటే పవన్ జనసేన గురించి చిరంజీవికి ముందే తెలుసని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉన్నా చిరంజీవి రాజకీయాలకు దూరం కావడానికి కారణం ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పవన్ నిబద్ధత ఉన్న నాయకుడని ఎక్కడా పొల్యూట్ కాలేదని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.

ఏలే అవకాశం పవన్ కు ప్రజలు ఇస్తారేమో అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి కామెంట్లు చేశారు. చిరంజీవి కామెంట్లు సంచలనం సృష్టిస్తుండగా జనసేనకు సైలెంట్ గానే చిరంజీవి మద్దతు ప్రకటించారు. చిరంజీవి మద్దతుతో జన సైనికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.