కుప్పంలో జగన్ సభను కూడా పట్టించుకోరా?

2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని జగన్ ప్రగల్భాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. జగన్ మాటలు విన్న వైసీపీ అభిమానులు నిజంగా కుప్పంలో అలాంటి పరిస్థితి ఉందేమో అని భావిస్తున్నారు. కుప్పం అభివృద్ధి కోసం జగన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరే నియోజకవర్గంపై దృష్టి పెట్టని స్థాయిలో జగన్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.

తాజాగా వైఎస్సార్ చేయూత స్కీమ్ అమలు సందర్భంగా కుప్పంలో జగన్ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీస్థాయిలో జనం హాజరయ్యారు. అయితే ఈ సభకు హాజరైన వాళ్లలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందిన వారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కుప్పం ప్రజలు జగన్ సభకు హాజరు కాకుండా ఇంటికే పరిమితం అయ్యారని సమాచారం అందుతోంది. కుప్పంలో వైసీపీ వాస్తవ పరిస్థితి ఇదీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

కుప్పంలో 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ గెలవడం కష్టమేనని తెలుస్తోంది. జగన్ సభను కూడా అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. జగన్ కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జగన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిధులను విడుదల చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించలేకపోవడం వల్ల పల్లెల్లో నివశించే ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ గుర్తుంచుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.