చంద్రబాబుకు బాబ్లీ నోటీసుల వెనుక అసలు రహస్యమిదే

బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం బీజేపీ కుట్రగా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల బీజేపీకి టీడీపీ నేతలు నిరసనలు చేపట్టారు. కేసు వాపసు తీసుకోకుంటే ప్రజాగ్రహం తప్పదంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి.

న్యాయ ప్రక్రియను రాజకీయాలతో ముడి పెట్టడం కరెక్ట్ కాదన్నారు పురంధేశ్వరి. అరెస్ట్ వారెంట్ల వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. కోర్టు వారెంట్ల వెనుక బీజేపీ హస్తం ఉందనడం చాలా బాధాకరం. ఏది జరిగినా బీజేపీకి ఆపాదించడం శోచనీయంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారో పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

2010 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ చవాన్ గారితో పార్టీకి సంబంధం లేదు. ఆనాడు కేసు నమోదైంది. ఆరోజు నుండి ఈరోజు వరకు కేసు 22 వాయిదాలు పడింది. ఇన్ని వాయిదాలు పడిన తర్వాత మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. అది మేజిస్ట్రేట్ కి, చంద్రబాబు నాయుడుకి, పార్టీ సభ్యులకి సంబంధించిన విషయం. దీనితో బీజేపీకి సంబంధం ఏముంటుంది? అని ప్రశ్నించారు పురంధేశ్వరి.

ప్రతిదీ బీజేపీ పార్టీ చేస్తున్న కక్ష్యపూరిత కుట్రగా ఆపాదించడం చాల బాధాకరం. ఇది ఎవరూ కూడా సమర్ధించనటువంటి విషయం. ఈ కేసులో 22 వాయిదాలు పడటానికి కారణం వారు వాయిదాకు హాజరు కాకపోవడమే. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. నిజంగా కక్ష్యపూరిత చర్యలు తీసుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వలన బీజేపీకి లాభం చేకూరే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటుంది? అని ప్రశ్నించారు. ఇది ప్రజలు గమనించాల్సిన అంశంగా పురంధేశ్వరి పేర్కొన్నారు.