పత్రికలు, ఛానెళ్లు తమ అనుకూల రాజకీయ పార్టీలను, నాయకులను వెనకేసుకొని రావడం, వారి చర్యలను సమర్థించడం షరా మామూలే. ఎన్నో ఏళ్లుగా తెలుగు మీడియా చేస్తున్న ఈ పక్షపాత ఫీట్లు చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని సమర్థించడమో, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే వారి తరపున ప్రభుత్వం మీద బురద చల్లడమో లాంటి చర్యలను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ఆ మద్దతు హద్దులు దాటిపోయింది. ఏకంగా గతాన్నే మార్చేసే పని పెట్టుకుంటున్నాయి పత్రికలు. తమవారిని సేవ్ చేయాలనే తపనలో నిర్భయంగా నిజాలను తొక్కేస్తున్నాయి. జనాలకు ఏమీ తెలియదని అనుకుంటున్నారో లేకపోతే తామేమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారనే గుడ్డి నమ్మకమో కానీ విపరీత ధోరణిలోకి వెళ్లిపోతున్నాయి. ఈరోజు సాక్షి పత్రికలో ‘తాడిపత్రిలో జేసీ అలజడి’ అనే శీర్షికతో వెలువడిన కథనాన్ని చదివితే ఇదే అనిపిస్తుంది.
నిన్న తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెద్ది పెద్దారెడ్డి, జేసీ వర్గాల నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారనే కోపంతో పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటి మీదకు వెళ్లారు. అక్కడున్న వ్యక్తిని చితగ్గొట్టారు. ఇదంతా జేసీ, ఆయన అనుచరులు ఇంట్లో లేని సమయంలో జరిగింది. ఒకవేళ జేసీ ఉంది ఉంటే సీన్ వేరేలా ఉండేది. అసలు జేసీ అక్కడుంటే పెద్దిరెడ్డి ఆయన ఇంట్లోకి వెళ్లి భీభత్సం చేయగలిగేవారా, ఆయన చేస్తుంటే జేసీ చూస్తూ ఊరుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాడి గురించి తెలుసుకున్న జేసీ ఆయన కుమారుడు తాడిపత్రి రావడం, పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లాలని ట్రై చేయడం, పోలీసులు ఆపడం ఇరు వర్గాల మధ్యన రాళ్లదాడి, వాహనాల ధ్వంసం ఇలా నిన్నటి రోజున తాడిపత్రిలో ఏం జరిహిందనేది రాష్ట్ర ప్రజలందరికీ పాయింట్ టూ పాయింట్ తెలుసు.
జేసీ, పెద్దిరెడ్డి చిరకాల ప్రత్యర్థులనేది అందరికీ ఎరుకే. ఫ్యాక్షన్ గొడవలతో మొదలై రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు ఇద్దరూ. అలాంటి రాజకీయ ప్రత్యర్థి ఇంటికి పెద్దారెడ్డి నేరుగా వెళ్లడం అనేది చిన్నవిషయమేమీ కాదు. ఏమైనా విబేధాలుంటే పోలీసుల సమక్షంలో మాట్లాడుకోవాలి, లేకపోతే ఫోన్ హేసి ఎందుకిలా చేస్తున్నారని నిలదీయాలి. అంతేకానీ రాడ్లు, కర్రలు పట్టుకుని నేరుగా ఇళ్ల మీదకు వెళ్లడం సమంజసమేనా అంటున్నారు జనం. సరే విషయం వైసీపీ ఎమ్మెల్యేది కాబట్టి సాక్షి వే ఆఫ్ [ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో చూడాలనే కుతూఊహలం సహజంగానే జనంలో ఉంది. కానీ అందులో తాడిపత్రిలో జేసీ అలజడి అనే శ్రీశుక చూసేసరికి అందరికీ మైండ్ బ్లాక్ అయింది.
అల్లర్లకు జేసీ ముందస్తు వ్యూహం, పెద్దారెడ్డి మీద కవ్వింపు చర్యలు, మాట్లాడేందుకే జేసీ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే, జేసీ లేకపోవడంతో వెనుదిరిగిన ఎమ్మెల్యే, గంట తర్వాత ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు తమ కార్యకర్తలతో హంగామా, కేతిరెడ్డి అనుచరులపై రాళ్ల దాడి, వైసీపీ నేతలకు తీవ్ర గాయాలు ఇది ప్రెజెంటేషన్. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే మూడో కంటికి తెలియకుండా జేసీని కలిసి వద్దామని అనుకుంటే జేసీ వర్గమే గొడవ చేసిందని కంక్లూజన్ ఇచ్చేశారు. దీన్ని చదివాక మేనిప్యులేట్ చేయవచ్చు కానీ మరీ ఈ స్థాయిలోనా. ఎమ్మెల్యే జేసీ ఇంటికి వెళ్లడం, గొడవ చేయడం వీడియోలతో సహా తెలుస్తూనే ఉంది. మాట్లాడటానికి వెళ్ళినవారు ఇనుప రాడ్లు తీసుకుని వెళతారా, ఎవరూ లేకపోతె కనిపించినవారికి చితకబాది వస్తారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు మనఃసాక్షి ఉంటే ఇలాంటి వార్తలు రాస్తారా అనుకుంటూ పేపర్ మడిచేస్తున్నారు.