టీడీపీకి రాయపాటి షాక్… కన్నాకు కొత్త టెన్షన్?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు మహారంజుగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగులు, చేరికలతో సందడి మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు షాకివ్వబోతున్నారని తెలుస్తుంది.

అవును… గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్లలో ఒకరైన బలమైన నేత రాయపాటి సాంబశివరావు సైకిల్ దిగిపోబోతున్నారని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు అనివార్యం అయిన వేళ.. రాయపాటి ఇలా షాకివ్వబోతున్నారని అంటున్నారు. అయితే కన్నా టీడీపీలో చేరడం వల్ల… రాయపాటి అసౌకార్యానికి గురవ్వడమే ఈ నిర్ణయానికి కారణం అని తెలుస్తుంది.

ఎప్పటినుంచో ఉప్పూ – నిప్పూ గా ఉంటున్న రాయపాటి సాంబశివరావు – కన్నా లక్ష్మీనారాయణలు ఒకే పార్టీలో ఉండే ఛాన్స్ చాలా తక్కువని గతంలో పలువురు విశ్లేషకులు అభిప్రాయపడినట్లు కాథనాలొచ్చాయి. వాటిని అనుగుణంగానే… కన్నా త్వరలో సైకిల్ దిగిపోతారని.. టిక్కెట్ కన్ ఫాం చేస్తే ఫ్యాన్ కిందకు చేరిపోతారని అంటున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో తనకు ఎంపీ సీటు ఇవ్వకపోతే… తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేసే ఛాన్స్ కూడా ఇవ్వాలని అడుగుతున్నారని తెలుస్తుంది. ఈమేరకు ఏదో ఒక హామీ వైసీపీ నుంచి లభిస్తే… రాయపాటి సైకిల్ దిగిపోవడం పెద్ద విషయం కాదని… కన్నా ఉన్న చోట తాను ఇమడలేకపోతున్నట్లు సన్నిహితులదగ్గర చెబుతున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో… బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఖరారు చేశారు చంద్రబాబు! దీంతో… తాము ఆశిస్తున్న సీటులో తమతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కన్నాకు కట్టబెట్టడం ఏంటనేది రాయపాటి వర్గం ప్రశ్నగా ఉందంట. కొత్త నాయకులు రాగానే.. సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారని బాఉపై రాయపాటి వర్గం ఆగ్రహంగా ఉందని అంటున్నారు. దీంతో… ఆ ఉక్కబోత భరించలేక సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి చేరిపోతారని అంటున్నారు!

ఇదే సమయంలో తనకుమారుడి కోసం అడిగిన సీటును, కనీసం తనతో సంప్రధించకుండా కన్నాకు ఇవ్వడంపై రాయపాటి సైతం గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కన్నా ఓటమికి తాను ప్రధాన కారణం కావాలని యోచిస్తున్నారని సమాచారం.

అదేవిధంగా… సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్ తనకు ఇవ్వడంలేదని ఇప్పటికే కోడెల శివరాం ఫుల్ చంద్రబాబు – కన్నా లపై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. దీంతో ఇంతమంది శత్రువులను రెడీ చేసుకున్న కాన్నాకు.. ఈసారి సత్తెనపల్లిలో కొత్త టెన్షన్ కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు!

కాగా… గుంటూరు జిల్లా సీనియర్ పొలిటీషియన్ అయిన రాయపాటి సాంబశివరావు… కాంగ్రెస్ తరుపున గుంటూరు ఎంపీగా నాలుగు సార్లు గెలిచారు. అనంతరం రాష్ట్ర విభజన సమయంలో 2014లో టీడీపీలో చేరారు. నర్సరావు పేట నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.