అమరావతిలో రాయలసీమ హక్కుల కోసం ఉద్యమం మొదలయింది. ఇంతవరకు రాయలసీమజిల్లాలకేపరిమితమయిన ఉద్యమం ఇపుడు రాజధానికి ఎగుబాగుతూ ఉంది. ఇపుడిపుడే విస్తరిస్తున్న ఈ ఉద్యమం, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, భారీ ఉద్యమం అయ్యే ప్రమాదం ఉంది. మరొక వేర్పాటు వాదానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. రాయలసీమలో ఈ మేరకు సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో వివిధ రాయలసీమ సంఘాల ఐక్యవేదిక శ్రీభాగ్ ఒప్పందం అమలుకోరుతూ ధర్నా చేసింది.
శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలంటూ ఈ సంఘాలు నేతలు అమరావతి దద్దరిల్లేలా నినాదాలు చేశారు.
మొదల వేలాది మంది భారీ ర్యాలీగా తరలి వచ్చి ధర్నా చౌక్ లో సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు.
వారంతా కరువుసీమను కాపాడాలంటూ చట్టబద్దం కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. వారు చేస్తున్న మరికొన్ని డిమాండ్లు:
# అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి.
# దశాబ్దాలుగా రాయలసీమ లో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ లను సత్వరమే పూర్తి చేయాలి.
# రాయలసీమ పై పాలకుల నిర్లక్ష్యం , పక్షపాత ధోరణి వీడాలి.
# విభజన చట్టం లోని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి..
# బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాయలసీమ నీటి హక్కును కాపాడేలా వాదన వినిపించాలి.
# కడప ఉక్కు కర్మాగారాన్ని వెంటనే నిర్మించాలి.
# అన్ని అర్హతలు వున్న గుంతకల్లు ను రైల్వే జోన్ గా ప్రకటించాలి.
# రాయలసీమ అవసరాలు తీరిన తరువాతనే శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదలాలి.
# వ్యవసాయ విశ్వవిద్యాలయం, క్రిష్ణా ట్రిబ్యునల్ బోర్డు, హైకోర్టు, ఎయిమ్స్ లను రాయలసీమ లోనే ఏర్పాటు చేయాలి.
# ఆధ్యాత్మిక, పర్యాటక హబ్ గా రాయలసీమ ను తీర్చి దిద్దాలి.
# సిద్దేశ్వరం, గుండ్రేవుల, వేదవతి తదితర క్రొత్త ప్రాజెక్ట్ లను తక్షణమే చేపట్డాలి.
# కేంద్రం ప్రకటించిన వెనుక బడిన జిల్లాల ప్రత్యేక నిధులు రాయలసీమ కు వెంటనే విడుదల చేయాలి.
# వరద జలాలు కాదు.. ఏటా వృధాగా సముద్రం పాలవుతున్న వేయ్యి టి.యం.సి.ల నికర జలాలను రాయలసీమ కు మళ్ళించాలి.
ఈ డిమాండ్ల మీద కార్యాచరణ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రాయలసీమ డిమాండ్లకు పలువురు కోస్తాంధ్ర నేతల మద్దతు కూడా వారు కూడగట్టారు. శాంతియుతంగా ప్రజస్వామ్యయుతంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతునిచ్చేలా రాయలసీమ సంఘాలు ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.