వైరల్ పిక్: అనారోగ్యంతో బెడ్ మీద రామోజీ… అలాంటాయన కాదంట!

సాధారణంగా రామోజీ రావుకి సంబంధించిన ఏ ఫోటోలూ బయట మీడియాలో కనిపించవు. ఈనాడు లో పనిచేసిన వారు, ఆర్.ఎఫ్.సీ. లో చైర్మన్ బిల్డింగ్ లో వర్క్ చేసిన వారే ఆయనను ఈమధ్యకాలంలో చూసింది అరుదు. అలాంటి రామోజీకి చెందిన ఒక ఫోటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోలో ఆయన నడుముకు పట్టీ కట్టుకుని, బెడ్ పై పడుకుని ఉన్నారు.

ఇదిలా ఉండగా మార్గదర్శికి సంబంధించి ఆర్ధిక లావాదేవీల విషయంలో వ్యక్తిగతంగా విచారించేందుకు ఏపీ సీఐడీ పోలీసులు హైదరబాద్ చేరుకున్నారు. మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ కి ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు ఏ-1, ఏ-2 లుగా ఉన్న రామోజీ – శైలజలను ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది.

చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లఘించి మార్గదర్శి నిధులను వేరే వాటికి మళ్ళించడం మీద రామోజీరావుని ఏ-1 గా శైలజా కిరణ్ ని ఏ-2 గా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఏపీలో ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల మేనేజర్ల మీద ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చందాదారుల సొమ్ముని మ్యూచువల్ ఫండ్స్ లోనూ షేర్ మార్కెట్ లోనూ పెట్టుబడిగా పెట్టారన్నదే ప్రధాన అభియోగం. ఇదంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధలనకు విరుద్ధం!!

అయితే… సీబీఐ – సీఐడీ – ఈడీ – ఐటీ వంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణలు ఎదుర్కొనే సమయంలో… పెద్ద పెద్ద వాళ్లకు సంబందించిన ఇలాంటి ఫోటోలు వైరల్ అవ్వడం సహజమేనని.. అలా అనారోగ్యం సాకు చూపి విచారణను తప్పించుకోవాల్సిన అవసరం రామోజీకి లేదని.. ఈ ఫోటో ఇప్పటిది కాకపోవచ్చని.. రామోజీ మరింతకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు ఆయన అభిమానులు!