రామోజీ ఆస్తుల అటాచ్‌మెంట్.! పెద్ద వార్తే కాదు.!

మీడియా మొఘల్ రామోజీరావు ఆస్తుల్ని ఏపీ సీఐడీ అటాచ్ చేసిందట. సుమారు 800 కోట్ల రూపాయల మేర ఆస్తులకు సంబంధించి అటాచ్‌మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ జీవో.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారి రామోజీరావు, గత కొన్నాళ్ళుగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎంపీ వుండవల్లి అరుణ్ కుమార్, రామోజీరావుపై న్యాయపోరాటం ప్రారంభించారు.

అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ కేసు అలా అలా సాగుతూనే వుంది. మధ్యలో ఈ కేసు అటకెక్కిపోయినా, ఇటీవల మళ్ళీ అటక మీద నుంచి కిందికి దిగింది. ఏపీ ప్రభుత్వం ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే రామోజీ ఆస్టుల అటాచ్‌మెంట్ కూడా జరిగింది.

అయితే, రామోజీరావు మాత్రం ఈ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడంలేదు. టీడీపీ ఎలాగూ రామోజీరావుకి మద్దతుదానే నినదిస్తుందనుకోండి.. అది వేరే సంగతి. ఏపీ సీఐడీ ఇప్పటికే రామోజీరావు సహా, ఆయన కుటుంబ సభ్యుల్నీ విచారించింది.

ఈ కేసులో పలు అరెస్టులూ జరిగాయి. ఇప్పుడేమో ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారం. ముందు ముందు రామోజీ అరెస్టు వరకూ వెళుతుందో ఏమో.! ఇంత జరుగుతున్నా, రామోజీ ఆస్తుల అటాచ్‌మెంట్ అన్న అంశం తెలుగు మీడియాలో పెద్ద వార్త కాకుండా పోయింది.