టిడిపికి షాక్… ఏపీ మంత్రి నారాయణకు ఝలక్

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రి నారాయణకు ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్‌తో పాటు పలువురు అనుచరులు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ల ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు.

మంత్రి నారాయణ విధానాలు నచ్చక పలువురు పార్టీని వీడుతున్నారని, రామ్మోహన్ రావడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందని అనిల్ కుమార్ అన్నారు. చంద్రబాబు అసలు రూపం తెలుసుకుని వైసీపీకి మద్దతు ఇస్తున్నారని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు నగరాన్ని 5వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి నారాయణ డబ్బుతో ఓట్లు ఎందుకు కొంటున్నారని ఆయన తోడల్లుడు రామ్మోహన్ ప్రశ్నించారు.