జనసేన కార్యకర్తను కాళహస్తి సీఐ అంజూ యాదవ్ కొట్టిన విషయాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఆయన సీఐ అంజూ యాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నీరసన తెలపడం హక్కని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాలపై తాజాగా ఆర్జీవీ స్పందించారు.
అవును… పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విషయాలపై రాం గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు పవన్ స్పందించిన వీడియోని పోస్ట్ చేస్తూ… దానిపై తనదైన శైలిలో ఒక కామెంట్ పోస్ట్ చేశారు.
చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా అంటూ సింహంలా గాండ్రించే పవన్ కల్యాణ్.. ఎస్పీ ముందు చేతులు కట్టుకొని ఎస్పీగారూ అంటూ మాట్లాడారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ హీరో నుంచి జీరో అయినట్టుందని.. ఈ ఘటనతో పవన్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానని సెటైర్లు వేశారు. దీంతో… వర్మ ట్వీట్ వైరల్ అవుతుంది.
ఇదే సమయంలో ఎస్పీ ముందు కూర్చుని పవన్ మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేసిన వర్మ… ఈ సన్నివేశం చూస్తుంటే… అంజూ యాదవ్ రియల్ హీరోయిన్ గా… పవన్ కల్యాణ్ రీల్ హీరోగా కనిపిస్తున్నట్లుందని చెబుతూ కన్నీరు విడుస్తున్న ఎమోజీలు పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో రాష్ట్రవిభజన సమయంలో పవన్ చేసిన ప్రసంగాలను సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేసిన వర్మ… ఆఫ్టర్ ఫ్యూ మంత్స్… అంటూ ఆ మాటలకు పూర్తి భిన్నమైన సన్నివేశానికి సంబంధించిన వీడియోని అటాచ్ చేశారు. ఈ సందర్భంగా… బ్యాక్ గ్రౌండ్ లో “ఎవడేమీ అంటే మనకేమిటన్నా… ” అనే లైన్స్ ఉన్న “జానీ” సినిమాలోని పాటను ప్లే చేశారు.
దీంతో… ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హేయ్ @PawanKalyan , చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా , అని సింహం లా గాండ్రించిన తర్వాత ఇలా దీనంగా చేతులు కట్టుకుని S P గారు అంటూ మాట్లాడటం హీరో నుంచి జీరో అయినట్టుంది.. యాజ్ ఏ ఫ్యాన్ , ఐ హర్టెడ్😢😫 pic.twitter.com/mrz3FH2sCO
— Ram Gopal Varma (@RGVzoomin) July 17, 2023
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2023