ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 8వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్ కాగా, ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.
దీంతో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడనున్నాయి. కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించగా ఈసారి కానే విలియమ్సన్ జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కానే విలియమ్సన్ (కెప్టెన్), విజయ్ శంకర్, యూసుఫ్ పటాన్, మనీష్ పాండే, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
రాజస్థాన్ రాయల్స్: అజింక్యా రహానే (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, స్టీవెన్ స్మిత్, బెన్ స్టోక్, రాహుల్ త్రిపాఠీ, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా అర్చర్, జయ్2దేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్, ధవల్ కుల్‌కర్ణి.